భద్రాచలంలో పాడైపోయిన లడ్డూలు... ఉద్యోగి జీతం నుంచి డబ్బు రికవరీ!
- శ్రీరామనవమి సందర్భంగా బెల్లం లడ్డూల తయారీ
- కరోనా కారణంగా భక్తులకు పంచని అధికారులు
- పాడైపోయిన 4,260 కు పైగా లడ్డూలు
గత వారం జరిగిన శ్రీరామనవమి వేడుకల సందర్భంగా భక్తులకు పంచేందుకు సిద్ధం చేసిన దాదాపు 4,260కి పైగా బెల్లం లడ్డూలు పాడైపోవడంతో, ఆ డబ్బును సంబంధిత ఉద్యోగి నుంచి రికవరీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే, శ్రీరామ కల్యాణం వైభవంగా జరిగిన తరువాత కరోనా కారణంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచలేదు.
దీంతో, బెల్లం లడ్డూలన్నీ పాడైపోయాయి. ఈ విషయంలో ఆలయ ఈఓ శివాజీ విచారణ జరిపించారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని తేలుస్తూ, ఓఉద్యోగి వేతనం నుంచి రూ. 85,200 రికవరీ చేయాలని శివాజీ ఆదేశించారు.