రూ. 100 కోట్ల షేర్లను కొన్న ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు శిబులాల్

  • 7,58,755 ఇన్ఫోసిస్ షేర్లను కొన్న శిబులాల్
  • సోల్ బ్రోకర్ గా వ్యవహరించిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్
  • కరోనా సమయంలో కూడా లాభాల్లో పయనించిన ఇన్ఫీ
ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎస్డీ శిబులాల్ ఈ సంస్థలో తన వాటాను పెంచుకున్నారు. రూ. 100 కోట్ల విలువైన 7,58,755 షేర్లను కొనుగోలు చేశారు. ఒక్కో షేరును రూ. 1,317.95 వంతున వీటిని కుమారి శిబులాల్ నుంచి బ్లాక్ డీల్ ద్వారా కొన్నారు. ఈ కొనుగోలు వ్యవహారంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సోల్ బ్రోకర్ గా వ్యవహరించింది.

ఈ డీల్ తో ఇన్ఫోసిస్ లో శిబులాల్ వాటా 0.07 శాతానికి పెరిగిందని రెగ్యులేటరీకి ఇన్ఫోసిస్ తెలిపింది. మార్చి చివరి నాటికి ఇన్ఫోసిస్ లో శిబులాల్ వాటా 0.05 శాతంగా ఉంది. ఇదే సమయంలో కుమారి శిబులాల్ హోల్డింగ్ కు ఇన్ఫోసిస్ లో 0.19 శాతం వాటా ఉండటం గమనార్హం. మరోవైపు కరోనా సమయంలో కూడా ఇన్ఫీ తన జోరును కొనసాగించింది. ఈ ఏడాది తమ నెట్ ప్రాఫిట్ 17 శాతం (రూ. 5,076 కోట్లు) పెరిగిందని గత నెలలో ఇన్ఫోసిస్ ప్రకటించింది.


More Telugu News