25 వేల కొవిడ్ బాధిత కుటుంబాలకు సాయం చేయాలని మంచు మనోజ్ నిర్ణయం
- రేపు మంచు మనోజ్ పుట్టినరోజు
- కీలక నిర్ణయం తీసుకున్న మంచు మనోజ్
- అభిమానులు, మిత్రులతో కలిసి సామాజిక సేవ
- కొవిడ్ బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందిస్తామని వెల్లడి
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మే 20న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని మంచు మనోజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. అభిమానులు, మిత్రులతో కలిసి 25 వేల కొవిడ్ బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించనున్నట్టు వెల్లడించారు. ఈ సేవలను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నానని మనోజ్ తెలిపారు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటూ తమ కుటుంబాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మాస్కులు ధరిస్తూ, తరచుగా శానిటైజ్ చేసుకుంటూ మన ప్రపంచాన్ని మనమే కాపాడుకుందామని పేర్కొన్నారు.