దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లిని పరామర్శించిన కన్నబాబు, కొడాలి నాని

  • ఇటీవల మంత్రి వెల్లంపల్లికి పితృవియోగం
  • అనారోగ్యంతో సూర్యనారాయణ మృతి
  • వెల్లంపల్లి నివాసానికి వచ్చిన కొడాలి నాని, కన్నబాబు
  • సూర్యనారాయణ చిత్రపటానికి నివాళులు
ఇటీవల ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు పితృవియోగం సంభవించడం తెలిసిందే. వెల్లంపల్లి తండ్రి సూర్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు ఇవాళ తమ సహచర మంత్రి వెల్లంపల్లిని ఆయన నివాసంలో పరామర్శించారు.

విజయవాడ బ్రాహ్మణవీధిలోని వెల్లంపల్లి నివాసానికి విచ్చేసిన కొడాలి నాని, కన్నబాబు... వెల్లంపల్లి సూర్యనారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలంటూ వెల్లంపల్లికి సూచించారు. వెల్లంపల్లి నివాసానికి వచ్చిన వారిలో ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, శంబంగి చిన వెంకట అప్పలనాయుడు తదితరులు కూడా ఉన్నారు.


More Telugu News