కొవిడ్ రిపోర్టు లేదని గర్భిణిని చేర్చుకోని ఆసుపత్రి సిబ్బంది.. బయటే ప్రసవం, బిడ్డ మృతి
- కర్ణాటకలోని మాండ్యాలో ఘటన
- ప్రాధేయ పడినా చేర్చుకోని వైద్యులు
- తల్లి కళ్లముందే కన్నుమూసిన శిశువు
పురుటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన మహిళను కొవిడ్ రిపోర్టు లేదన్న కారణంతో చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ఆసుపత్రి బయటే ఆమె ప్రసవించింది. అయితే, పుట్టిన వెంటనే శిశువు కన్నుమూసింది. కర్ణాటకలోని మాండ్యాలో జరిగిందీ ఘటన. నిండు గర్భిణి అయిన సోనూ ప్రసవం కోసం మాండ్యాలోని ఎంఐఎం ఆసుపత్రికి వెళ్లింది. అయితే, కరోనా రిపోర్టు లేదన్న కారణంతో ఆమెను చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించారు.
ఆమె కుటుంబ సభ్యులు ఎంతగా ప్రాధేయపడినా వైద్యులు వినిపించుకోలేదు. అదే సమయంలో నొప్పులు ఎక్కువై సోనూ ఆసుపత్రి బయటే ప్రసవించింది. ఆ తర్వాత కాసేపటికే శిశువు మరణించింది. వైద్యులు చేర్చుకుని ఉంటే శిశువు చనిపోయి ఉండేది కాదని బాధిత కుటుంబ సభ్యులు రోదించారు. ఈ ఘటనపై ఆసుపత్రి అధికారులు స్పందించలేదు.