చిన్నారి పెద్ద మనసుకు చిరంజీవి ఫిదా... వీడియో ఇదిగో!

  • చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు అన్షి అనే బాలిక విరాళం
  • ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం కోసం విరాళం
  • ఓ వీడియోలో వెల్లడించిన చిరంజీవి
  • ఆకట్టుకుంటున్న చిన్నారి మాటలు
కరోనా విపత్కర పరిస్థితుల్లో చిన్న సాయం కూడా ఎంతో విలువైనదే. అందుకే అన్షి అనే చిన్నారి తమ ట్రస్టుకు అందించిన విరాళాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రముఖంగా ప్రస్తావించారు. పి.శ్రీనివాస్, హనీ దంపతుల కుమార్తె అన్షి తను దాచుకున్న డబ్బులతో పాటు, తన పుట్టినరోజు వేడుకలకు అయ్యే ఖర్చును కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చిందని చిరంజీవి వెల్లడించారు. ఆ డబ్బును చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు కోసం వినియోగించాలని అన్షి కోరిందని తెలిపారు. తన చుట్టూ ఉన్న ప్రపంచం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషం అవుతుందని ఆ చిన్నారి చెబుతోందని కొనియాడారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆ చిన్నారి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ను కూడా పంచుకున్నారు.


More Telugu News