ఏపీలో ప్రభుత్వ సలహాదారుల పదవీకాలం పొడిగింపు

  • సజ్జల, జీవీడీ, రఘురాం పదవీకాలం పొడిగింపు
  • సీఎం సలహాదారు అజేయకల్లం పదవీకాలం కూడా పొడిగింపు
  • ఏడాది పాటు పొడిగిస్తూ సీఎస్ ఉత్తర్వులు
  • సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవ్య
ఏపీ ప్రభుత్వ సలహాదారుల పదవీకాలం పొడిగించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్, రఘురాంల పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం పదవీకాలం కూడా పొడిగించారు. ఈ నలుగురి పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ సలహాదారుల పదవీకాలం రెండేళ్లు కాగా, ప్రభుత్వం పొడిగించే వీలుంది. వీరికి క్యాబినెట్ హోదా సహా అనేక సౌకర్యాలు అందుతాయి. వీరికి వేతనాల రూపంలోనే రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అందుతాయి. అంతేకాదు, వ్యక్తిగత సహాయకులు, వాహనం, డ్రైవర్, కార్యాలయ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది.

అటు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవ్యను నియమించారు. నవ్య నియామకాన్ని ఖరారు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు.


More Telugu News