జడ్జి రామకృష్ణకు షరతులతో కూడిన బెయిల్
- మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
- రూ.50 వేల పూచీకత్తును సమర్పించాలని ఆదేశం
- మీడియాతో మాట్లాడకూడదని షరతు
- విచారణకు సహకరించాలని ఆదేశాలు
రాజద్రోహం కేసులో అరెస్టయి, సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పై ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై ఏప్రిల్ లో పోలీసులు రామకృష్ణను అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య అనే వ్యక్తి ఫిర్యాదుతో.. కరోనా టెస్టుకు వెళుతుండగా రామకృష్ణను దారి మధ్యలో అదుపులోకి తీసుకున్నారు.
దీంతో ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై కొంతకాలంగా విచారణ చేస్తున్న హైకోర్టు.. తాజాగా బెయిల్ ఇచ్చింది. అయితే, పలు షరతులను విధించింది. రూ.50 వేల పూచీకత్తును సమర్పించాలని, కేసుకు సంబంధించిన అంశాలపై మీడియాతో మాట్లాడకూడదని, విచారణాధికారులకు ఎప్పటికప్పుడు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన పీలేరు సబ్ జైలులో ఉన్నారు.