తూర్పుగోదావరి జిల్లాలో 33 మంది గ్రామ వాలంటీర్ల తొలగింపు

  • విధులను సరిగా నిర్వహించని వాలంటీర్టు
  • జ్వరం లేని వారికి కూడా ఉన్నట్టుగా ఆన్ లైన్లో పేర్ల నమోదు
  • వేటు వేసిన జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి
విధులను సక్రమంగా నిర్వహించని గ్రామ వాలంటీర్లపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా 33 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. కరోనా ఫీవర్ సర్వేలో జ్వరం లేని వారికి కూడా ఉన్నట్టుగా ఆన్ లైన్ లో పేర్లు  నమోదు చేశారనే ఆరోపణలతో వీరిపై వేటు వేశారు. వీరిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల నుంచి తొలగింపబడ్డ వాలంటీర్లు కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, రాజమండ్రి అర్బన్, తుని, రాజోలు, అమలాపురం, మామిడికుదురు ప్రాంతాలకు చెందినవారిగా సమాచారం.


More Telugu News