అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై 24న జమ్మూకశ్మీర్‌ రాజకీయ పార్టీలతో ప్రధాని మోదీ భేటీ

  • ఆగస్టు 2019లో జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు
  • తిరిగి రాజకీయ పునరుద్ధరణ చర్యలకు నడుంబిగించిన కేంద్రం
  • చర్చల్లో పాల్గొననున్న అమిత్ షా, ఇతర నేతలు!
ఆగస్టు 2019లో జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి ఎన్నికలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్న కేంద్రం రాజకీయ పునరుద్ధరణ చర్యలకు నడుంబిగించింది.

ఈ క్రమంలో ఈ నెల 24న జమ్మూకశ్మీర్‌లోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర నేతలు కూడా ఇందులో పాల్గొంటారని సమాచారం. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారి, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ లోనె తదితరులను ఈ సమావేశానికి ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది.


More Telugu News