ఎలక్ట్రిక్ టూవీలర్ల ధర తగ్గించిన హీరో

  • ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి కేంద్రం ప్రోత్సాహం
  • రాయితీలు పెంచిన వైనం 
  • రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంపు
  • పలు మోడళ్ల ధరలు సవరించిన హీరో
ద్విచక్రవాహన తయారీ దిగ్గజం హీరో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల ధరలు తగ్గించింది. సింగిల్ బ్యాటరీ వేరియంట్ పై 12 శాతం,  ట్రిపుల్ బ్యాటరీ వేరియంట్లపై 33 శాతం వరకు తగ్గిస్తున్నట్టు హీరో వెల్లడించింది. ఫేమ్-2 (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకంలో భాగంగా కేంద్రం రాయితీలు పెంచడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, రాయితీల పెంపుతో కలిగే ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలన్న ఉద్దేశంతో ధరల సవరణ చేపట్టామని వివరించింది.

దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వాహన తయారీదారులను కేంద్రం రాయితీలతో ప్రోత్సహిస్తోంది. ఇప్పటివరకు 1 కిలోవాట్ అవర్ కు రూ.10 వేలు రాయితీ ఇస్తుండగా, ఫేమ్-2లో భాగంగా దాన్ని రూ.15 వేలకు పెంచారు. అంతేకాదు, వాహనం ధరలో 20 శాతం వరకు అందించే సబ్సిడీని కూడా 40 శాతానికి పెంచారు. ఈ నేపథ్యంలోనే హీరో సంస్థ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది.


More Telugu News