యాంటీ కొవిడ్ డ్రగ్ '2-డీజీ' ఉత్పత్తికి లైసెన్స్ పొందిన లారస్ ల్యాబ్స్

  • 2-డీజీని అభివద్ధి చేసిన డీఆర్‌డీవో
  • ఓ మోస్తరు నుంచి మధ్యస్థాయి లక్షణాలున్న వారికి అద్భుత ఔషధం
  • ఈయూఏ కోసం సీడీఎస్‌సీవోకు లారస్ ల్యాబ్స్ దరఖాస్తు
డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్ ఔషధం 2-డీజీ (డీఆక్సీ-డి గ్లూకోజ్) ఉత్పత్తిని చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన లారస్ ల్యాబ్స్‌ లైసెన్స్ పొందింది. ఈ మేరకు లారస్ ల్యాబ్స్ ప్రకటించింది. కరోనా వైరస్ బారినపడి ఓ మోస్తరు నుంచి మధ్యస్థాయి లక్షణాలు ఉన్న వారు త్వరగా కోలుకునేందుకు ఈ ఔషధం అద్భుతంగా పనిచేస్తుందని భావిస్తున్నారు.

నోటి ద్వారా తీసుకునే 2-డీజీ అత్యవసర వినియోగ అనుమతికి డీసీజీఐ నుంచి ఇప్పటికే అనుమతి లభించింది. మరోవైపు, ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఈయూఏ) కోసం సీడీఎస్‌సీఓ (సెంట్రల్ డ్రగ్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్)కు లారస్ ఇప్పటికే దరఖాస్తు చేసింది. యాంటీ కొవిడ్ డ్రగ్ 2-DG ఫస్ట్ బ్యాచ్‌ను ఈ ఏడాది మే నెలలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ విడుదల చేశారు.


More Telugu News