కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి

  • కలకలం రేపిన కౌశిక్ రెడ్డి ఆడియో
  • టీఆర్ఎస్ టికెట్ తనకేనన్న కౌశిక్
  • షోకాజ్ నోటీసులు పంపిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, టీపీసీసీ కార్యదర్శి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ హైకమాండ్ కు పంపించారు. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ టికెట్ తనకే రానుందని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

దీనిపై కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర జేసింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు పంపింది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అవసరమయితే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ తనపై చర్యలు తీసుకోక ముందే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.


More Telugu News