ఏపీ విద్యార్థులు మరో విషమ పరీక్ష ఎదుర్కోబోతున్నారు: రఘురామ

  • కరోనా ప్రభావంతో ఏపీలో స్కూళ్లు బంద్
  • ఆగస్టు 16 నుంచి స్కూళ్ల రీఓపెనింగ్
  • సుప్రీంకోర్టు వల్ల పరీక్షల గండం తప్పిందన్న రఘురామ
  • స్కూళ్ల రీఓపెనింగ్ పై రహస్య బ్యాలెట్ కు డిమాండ్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడిన స్కూళ్లను ఆగస్టు 16 నుంచి తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై నరసాపురం ఎంపీ, వైసీపీ రెబెల్ నేత రఘురామకృష్ణరాజు స్పందించారు. ఇటీవల సుప్రీంకోర్టు జోక్యంతో పిల్లలు పరీక్షల గండం నుంచి బయటపడ్డారని వెల్లడించారు.

అయితే, వచ్చే నెలలో పాఠశాలలు తెరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, ఏపీ విద్యార్థులు మరో విషమ పరీక్ష ఎదుర్కోబోతున్నారని వ్యాఖ్యానించారు. పాఠశాలల ప్రారంభంపై రహస్య బ్యాలెట్ నిర్వహించాలని రఘురామ పేర్కొన్నారు.


More Telugu News