నాగర్ కర్నూలు జిల్లాలో భూప్రకంపనలు

  • పలు ప్రాంతాల్లో స్వల్పంగా కంపించిన భూమి
  • ప్రకంపనలతో ఉలిక్కి పడిన ప్రజలు
  • వర్షాల కారణంగా భూమి పొరల్లోకి నీరు చేరుకోవడం వల్ల ప్రకంపనలు
ఈ తెల్లవారుజామున తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్, అచ్చంపేట, ఉప్పునుంతలలో భూప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. మరోవైపు భూప్రకంపనలతో ఆ ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. భయభ్రాంతులతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. భారీ వర్షాలు, వరదల కారణంగా భూమి పొరల్లోకి నీరు చేరుకోవడం వల్ల భూప్రకంపనలు వచ్చి ఉండొచ్చని నిపుణులు చెపుతున్నారు.


More Telugu News