ఆఫ్ఘనిస్థాన్‌లో ఇక నాలాంటి అమ్మాయిలు బయటకు రాలేరు!: భారత్ లో ఉంటున్న ఆఫ్ఘన్ యువతి ఆవేదన
- నాలుగేళ్లుగా చండీగఢ్‌లో ఉంటోన్న ఆఫ్ఘన్ యువతి పర్వానా హుస్సేని
- ఆఫ్ఘనిస్థాన్‌లోని బామ్యాన్ పట్టణంలో ఆమె కుటుంబం
- ఇప్పుడు తాలిబన్లు ఏం చేస్తారో తెలియడం లేదని వ్యాఖ్య
- షరియా చట్టాలు అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆందోళన
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్లు రెచ్చిపోతోన్న తీరుపై ఇతర దేశాల్లో ఉన్న ఆఫ్ఘన్ పౌరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘన్‌లో తమ కుటుంబ సభ్యులను వారు ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదని చెప్పారు. తమ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండాపోయిందని చెబుతున్నారు.
నాలుగేళ్లుగా భారత్‌లోని పంజాబ్, చండీగఢ్‌లో ఉంటోన్న ఆఫ్ఘన్ యువతి పర్వానా హుస్సేని (24) తాజాగా మీడియాతో మాట్లాడింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని బామ్యాన్ పట్టణంలో ఆమె కుటుంబం నివసిస్తోంది. ఆ పట్టణాన్ని కూడా ఇటీవలే తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి తమ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా కలవడం లేదని ఆమె చెప్పింది. ఉగ్రవాదులు ఇళ్లలో ప్రవేశించి మహిళలను ఎత్తుకెళ్తున్నారని తెలిపింది.
ఇప్పుడు ఏం చేస్తారో తెలియడం లేదని చెప్పింది. తాలిబన్ల రాజ్యం ఏర్పడుతుండడంతో ఇక తనలాంటి అమ్మాయిలు ఇళ్ల నుంచి బయటకు రాలేరని వివరించింది. ఆఫ్ఘన్‌లో తాలిబన్లు షరియా చట్టాలు అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఆఫ్ఘన్ విషయంలో భారత్‌తో పాటు అమెరికా, ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నానని చెప్పింది.