తాలిబన్ల ఘాతుకం... అమృల్లా సలేహ్ సోదరుడి దారుణ హత్య

  • పంజ్ షీర్ లోయపై తాలిబన్ల పంజా!
  • రోహుల్లా సలేహ్ ను హింసించి చంపిన వైనం
  • రోహుల్లా గ్రంథాలయంలోకి తాలిబన్ల ప్రవేశం
  • పంజ్ షీర్ లోయ ప్రస్తుత పరిస్థితిపై అస్పష్టత
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల అకృత్యాలు కొనసాగుతున్నాయి. తనను తాను ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా సలేహ్ ను తాలిబన్లు అంతమొందించారు. రోహుల్లాను చంపేశామని తాలిబన్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయనను అత్యంత దారుణంగా హింసించి ప్రాణాలు తీసినట్టు తెలుస్తోంది.

పంజ్ షీర్ లోయలో రోహుల్లా సలేహ్ కు చెందిన గ్రంథాలయం ఇప్పుడు తాలిబన్ ముష్కరుల వశమైంది. ఈ గ్రంథాలయంలోకి తమ సాయుధులు ప్రవేశించిన ఫొటోలను తాలిబన్ వర్గాలు విడుదల చేశాయి. దాంతో రోహుల్లా సలేహ్ మరణించారన్న విషయం దాదాపు నిర్ధారణ అయింది. కాగా, ఆఫ్ఘన్ లో మీడియాపై తీవ్ర ఆంక్షలు ఉండడంతో పంజ్ షీర్ లోయలో ప్రస్తుత పరిస్థితి ఏంటన్నదానిపై స్పష్టతలేదు.


More Telugu News