ప్రైవేటు కాలేజీలను కొట్టేయడానికి వైసీపీ యత్నిస్తోంది: బొండా ఉమ

  • జగన్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తోంది
  • మాంటిస్సోరి, లయోలా వంటి విద్యా సంస్థలు కూడా మూతపడుతున్నాయి
  • ఫీజు రీయింబర్స్ మెంట్ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను నాశనం చేస్తోందని టీడీపీ నేత బొండా ఉమ విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యాసంస్థలు మూతపడుతున్నాయని చెప్పారు. గత 50 ఏళ్లుగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన మాంటిస్సోరిలాంటి విద్యాసంస్థలు కూడా మూతపడుతుండటం ఆవేదన కలిగిస్తోందని అన్నారు. దేశ వ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు ఉన్న లయోలా వంటి విద్యా సంస్థలు కూడా వైసీపీ ప్రభుత్వ దెబ్బకు మూతపడే స్థితికి చేరుకుంటున్నాయని చెప్పారు.

ప్రైవేటు కాలేజీలను కొట్టేయడానికి వైసీపీ యత్నిస్తోందని... అందుకే అవి మూతపడేలా జీవోలు ఇస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాక ఎందరో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని... వారందరి పక్షాన టీడీపీ పోరాటం చేస్తుందని చెప్పారు.


More Telugu News