సినీ పరిశ్రమలో రెండు గ్రూపులు ఎందుకు ఉండకూడదు?: ‘మా’ ఎన్నికలపై జీవిత

  • పోటీతత్వమే తప్ప శత్రుత్వం లేదు
  • ప్రధాని ఎన్నికల కన్నా ‘మా’ ఎన్నికలకు ప్రాధాన్యం
  • చిరంజీవి ఎవరికైనా మద్దతివ్వొచ్చన్న జీవిత
  • సినీ పరిశ్రమపై పవన్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ సమర్థన
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై జీవితా రాజశేఖర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇవాళ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఆమె జనరల్ సెక్రటరీగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రధాని ఎన్నికల కన్నా ‘మా’ ఎలక్షన్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయని ఆమె అన్నారు. తమలో ఎన్ని వివాదాలు వచ్చినా అందరిదీ ఒకే కుటుంబమని అన్నారు. మంచి వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నానన్నారు.

పృథ్వీ వ్యాఖ్యలు చిన్న పిల్లాడిలా ఉన్నాయని, ఆ ఆరోపణలు బాధించాయని చెప్పారు. రెండు ప్యానెళ్ల గురించి వ్యాఖ్యలు సరికాదని, ‘మా’ ఎప్పుడూ తలెత్తుకునే ఉండాలన్నారు. ఎన్నికలను తప్పుదారి పట్టించొద్దని సూచించారు. సినీ పరిశ్రమలో రెండు గ్రూపులు ఎందుకు ఉండకూడదని వ్యాఖ్యానించారు. పోటీతత్వమే తప్ప శత్రుత్వం లేదన్నారు. చిరంజీవి ఎవరికైనా మద్దతివ్వొచ్చని, అవసరమైతే విష్ణుకు కూడా ఇవ్వొచ్చని ఆమె అన్నారు.

కాగా, ఇవి ఎన్నికలు కాదని, కేవలం పోటీనేనని ప్రకాశ్ రాజ్ అన్నారు. గెలిపించేది.. ఓడించేది ఓటర్లేనని అన్నారు. వచ్చేనెల 3న ఎన్నికల ప్రణాళికను వెల్లడిస్తానని చెప్పారు. ‘మా’ ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దని, ఎలాంటి దూషణలు లేకుండా ఎన్నికలు సాగాలని సూచించారు. సినీ పరిశ్రమపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని చెప్పారు.


More Telugu News