పొట్టి క్రికెట్లో పొలార్డ్ అరుదైన రికార్డు
- పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ వికెట్లు
- కెరీర్‌లో 300 వికెట్లు తీసిన ఆల్‌రౌండర్
- పదివేల పరుగులు, 300 వికెట్లు తన పేరిట ఉన్న ఏకైక ప్లేయర్
విండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో ఇప్పటికే 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఈ విండీస్ ఆల్‌రౌండర్ తాజాగా మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్లో 300 వికెట్లు కూడా పడగొట్టాడు. మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో పొలార్డ్ ఈ రికార్డు సాధించాడు.
పంజాబ్ జట్టు సారధి కేఎల్ రాహుల్, క్రిస్ గేల్‌ను పెవిలియన్ చేర్చడంతో పొలార్డ్ ఖాతాలో 300 వికెట్లు చేరాయి. ఇలా పొట్టి ఫార్మాట్లో 300 వికెట్లు తీయడంతోపాటు, 10 వేల పరుగులు కూడా చేసిన ఏకైక ఆటగాడు పొలార్డే కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా జరిగే దాదాపు అన్ని టీ20 లీగుల్లో పొలార్డ్ ఆడతాడు.
బిగ్ బ్యాష్, ఐపీఎల్, కరీబియన్ క్రికెట్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్.. ఇలా దాదాపు అన్ని లీగుల్లో పొలార్డ్ ఉండాల్సిందే. ఇంత బిజీ ఆటగాడు కాబట్టే ఇప్పటి వరకూ తన కెరీర్‌లో ఏకంగా 560కి పైగా టీ20 మ్యాచులు ఆడాడు మరి.