ఏపీలో కొత్తగా 1,084 కరోనా కేసులు

  • అత్యధికంగా తూ.గో. జిల్లాలో 244 కేసులు  
  • రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది మృతి
  • రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 11,655
ఏపీలో గత 24 గంటల్లో 57,345 శాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 1,084 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 244 కేసులు నిర్ధారణ అయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 13 మంది మహమ్మారి కారణంగా మృతి చెందగా... 1,328 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20,49,314కి పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 20,23,496 మంది కోలుకున్నారు. కరోనా బారిన పడి 14,163 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,655 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


More Telugu News