అలా 'సలార్' కలిసొచ్చింది: శ్రుతిహాసన్
- తెలుగు .. తమిళ .. హిందీ సినిమాలపై దృష్టి
- ఏడాదికి ఒక భాషలో ఒక సినిమా చేస్తాను
- అలా మూడు సినిమాలు చేసినట్టు అవుతుంది
- ఈ సారి 'సలార్' ఒక్కటి చేస్తే సరిపోతుంది
- అన్ని భాషల్లో అది రిలీజ్ అవుతుంది
శ్రుతిహాసన్ తెలుగు .. తమిళ భాషల్లో మంచి జోరుమీదున్న సమయంలో ఆమె బాలీవుడ్ కి వెళ్లింది. అయితే అక్కడ సక్సెస్ కాలేకపోగా, ఈ రెండు భాషల్లో గ్యాప్ వచ్చేసింది. మళ్లీ పుంజుకోవాలని ఆమె ఆరాటపడుతుండగా 'సలార్' సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా ఛాన్స్ వచ్చింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. "సాధారణంగా నేను ఏడాదికి ఒక భాషలో ఒక సినిమా చేయాలనే నియమం పెట్టుకున్నాను. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఒక్కో సినిమా చేయడం వలన, కథలపై .. పాత్రలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని భావిస్తుంటాను. ఏడాదికి మూడు సినిమాలు చేసిన ఫీలింగ్ కూడా ఉంటుంది.
అయితే ఒక్కో సందర్భంలో నా నియమాన్ని పక్కన పెట్టేసి, ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేయడానికి సిద్ధమవుతుంటాను .. అలా చేస్తున్న సినిమానే 'సలార్'. ఇది పాన్ ఇండియా సినిమా .. వివిధ భాషల్లో విడుదలవుతుంది. దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోను గుర్తింపు దక్కుతుంది. వరుస సినిమాలు చేయాలనుకున్న నాకు 'సలార్' వలన కలిసొచ్చినట్టయింది" అంటూ చెప్పుకొచ్చింది.