పవన్ కల్యాణ్ పర్యటన ఎఫెక్ట్.. ధవళేశ్వరం ప్రాజెక్టుపై శరవేగంగా మరమ్మతులు
- గాంధీ జయంతి సందర్భంగా రేపు జనసేనాని శ్రమదానం
- ధవళేశ్వరం బ్యారేజీ వద్ద విద్యుద్దీపాలకు అధికారుల మరమ్మతులు
- తాత్కాలిక మరమ్మతు పనుల్లో బిజీ
గాంధీ జయంతి సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ధవళేశ్వరం బ్యారేజీతో పాటు అనంతపురం జిల్లా కొత్త చెరువు వద్ద రహదారుల మరమ్మతు కోసం శ్రమదానం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు అప్రమత్తమవుతున్నారు.
ఈ క్రమంలో ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. బ్యారేజీ వద్ద విద్యుద్దీపాలకు మరమ్మతు పనులు చేస్తున్నారు. మరోవైపు కాటన్ బ్యారేజీపై సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చవద్దని జల వనరుల శాఖ స్పష్టం చేసినప్పటికీ అక్కడ శ్రమదానం కొనసాగిస్తామని జనసేన మరోసారి తేల్చి చెప్పింది. దీంతో అక్కడ రేపు జరగనున్న శ్రమదానంపై ఉత్కంఠ నెలకొంది.