సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నాన్న నుంచి చాలా నేర్చుకుందట!
  • 'ఆహా' కోసం బాలకృష్ణ టాక్ షో
  • ప్రభాస్ కు భారీ స్థాయిలో పారితోషికం    
*  తన తండ్రి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెబుతోంది కథానాయిక శ్రుతిహాసన్. 'ముఖ్యంగా దేనికీ భయపడకూడదు అనేది నాన్న నుంచే నేర్చుకున్నాను. అలాగే లైఫ్ హాయిగా సాగిపోవాలంటే మన దైనందిన జీవితంలో కామెడీ అనేది ఎంతో అవసరం అని కూడా నాన్న నుంచే తెలుసుకున్నాను' అని చెప్పింది శ్రుతి.
*  నందమూరి బాలకృష్ణ త్వరలో ఒక టాక్ షో చేయనున్నట్టు తెలుస్తోంది. 'ఆహా' ఓటీటీ కోసం ఒక వెరైటీ టాక్ షోను బాలకృష్ణ హోస్ట్ చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ షో కాన్సెప్ట్ బాగా నచ్చడంతో చేయడానికి బాలయ్య ఓకే చెప్పినట్టు చెబుతున్నారు. 
*  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఆదిపురుష్' హిందీ చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం ప్రభాస్ సుమారు 150 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే, ఇండియాలోనే అత్యధిక పారితోషికాన్ని తీసుకునే హీరోగా ప్రభాస్ పేరు చెప్పుకోవాలి.


More Telugu News