చెన్నైపై టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్... ఇరుజట్లకు ఇదే చివరి లీగ్ మ్యాచ్
- దుబాయ్ లో పంజాబ్ వర్సెస్ చెన్నై
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
- ప్లే ఆఫ్స్ బెర్తుపై పంజాబ్ ఆశలు
- ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన చెన్నై
ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనుండగా, తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. కింగ్స్ పోరులో టాస్ నెగ్గిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఏ మూలో కాస్త అవకాశాలు ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్ లో విజయంపై కన్నేసింది. ఇరుజట్లకు ఇదే చివరి లీగ్ మ్యాచ్ కాగా, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరింది.
చెన్నైతో మ్యాచ్ కోసం పంజాబ్ జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. నికోలాస్ పూరన్ స్థానంలో ఆల్ రౌండర్ క్రిస్ జోర్డాన్ కు స్థానం కల్పించినట్టు తెలిపాడు. ఇక, చెన్నై జట్టులో ఎలాంటి మార్పులు లేవని, గత మ్యాచ్ ఆడిన జట్టును బరిలో దింపుతున్నామని కెప్టెన్ ధోనీ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది.