జగన్ గారూ... వెంకటేశ్వరస్వామిపై ఎందుకీ దొంగభక్తి?: నారా లోకేశ్

  • సీఎం జగన్ తిరుమల పర్యటన
  • విమర్శనాస్త్రాలు సంధించిన లోకేశ్
  • కొండపై జగన్ నామస్మరణ అంటూ వెల్లడి
  • మహాపరాధం అని ఆగ్రహం
సీఎం జగన్ తిరుమల పర్యటనపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. వేదపండితులు తలపై వేసిన అక్షతలను అసహ్యంగా దులుపుకున్నారని, పవిత్రమైన ప్రసాదాన్ని వాసన చూశారని లోకేశ్ ఆరోపించారు. వెంకటేశ్వరస్వామిపై ఎందుకీ దొంగభక్తి జగన్ రెడ్డి గారూ? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భక్తి ఉంటే భార్య ఎందుకు రాదు? అంటూ ప్రశ్నించారు.

అంతేకాదు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన అర్ధాంగిపైనా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఏడుకొండలవాడికి సేవ చేసే అవకాశం దొరికితే, ఆ స్వామి వారికే అపచారం తలపెట్టే పనులు మంచిది కాదు అంటూ వైవీ సుబ్బారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

"జగన్ మీ దేవుడే కావొచ్చు... ఆయన ఫొటోను మీ ఇళ్లలో పెట్టి పూజలు చేసుకోండి... దేవుడిగా కొలుచుకోండి.... వీలైతే పాదపూజ చేసుకోండి. కొండపై గోవింద నామాల బదులు జగన్ నామస్మరణ మహాపరాధం" అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వామి, అమ్మవార్లకు పదేపదే అపచారాలు తలపెడుతూ, జగన్ రెడ్డిని రక్షించే గోవిందుడు అంటూ టీటీడీ చైర్మన్ అర్ధాంగి అపచారపు నామస్మరణ చేయడం స్వామివారికి తీరని కళంకం అని పేర్కొన్నారు.


More Telugu News