ఆదిలాబాద్ జిల్లాలో మద్యం డిపోలో అగ్నిప్రమాదం.. తగలబడుతున్న కోట్లాది రూపాయల మద్యం

  • ఉట్నూర్ క్రాస్ రోడ్డులోని డిపోలో అగ్నిప్రమాదం
  • షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించి ఉండొచ్చన్న అధికారులు
  • ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో ఉన్న మద్యం డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది. ఉట్నూర్ క్రాస్ రోడ్డులోని ఐఎంఎల్డీ మద్యం డిపోలో చెలరేగిన మంటలు క్రమంగా విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాదస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది విశ్వప్రయత్నం చేస్తున్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండొచ్చని తెలిపారు. ప్రమాదం వల్ల కోట్లాది రూపాయల నష్టం సంభవించి ఉండొచ్చని అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News