వైసీపీ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి... ఈసీని కోరిన టీడీపీ నేతలు
- ఈసీని కలిసిన కేశినేని నాని, కనకమేడల, కిష్టప్ప
- వైసీపీపైనా, సీఎం జగన్ పైనా ఫిర్యాదు
- మీడియాకు వివరాలు తెలిపిన కేశినేని నాని
- విజ్ఞప్తులు పరిశీలించేందుకు ఈసీ హామీ ఇచ్చిందని వెల్లడి
టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప నేడు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లారు. వైసీపీ రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఎంపీ కేశినేని నాని మీడియాకు వెల్లడించారు.
12 కేసుల్లో చార్జిషీట్లు ఎదుర్కొంటున్న జగన్ జైలుకు వెళ్లి బెయిల్ పై బయట ఉన్నారని ఈసీకి తెలియజేశామని చెప్పారు. అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాడని, ఏ విధంగా వారి పార్టీ నేతలతో బూతులు తిట్టిస్తున్నాడన్న విషయాన్ని ఈసీకి వివరించామని తెలిపారు. వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరామని, తమ విజ్ఞప్తిపై ఈసీ సానుకూలంగా స్పందించినట్టు కేశినేని నాని వెల్లడించారు. అన్ని విషయాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు వివరించారు.