ఏపీలో రోడ్ల మరమ్మతులకు డెడ్ లైన్ విధించిన సీఎం జగన్
- రోడ్ల పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష
- మరమ్మతులు, పునరుద్ధరణపై చర్చ
- 2022 జూన్ నాటికి పూర్తిచేయాలని స్పష్టీకరణ
- ఓ స్పెషల్ డ్రైవ్ లా రోడ్ల పనులు చేయాలని ఆదేశం
ఏపీలో రహదారుల పరిస్థితులపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ అంశాలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు 2022 జూన్ నాటికి పూర్తి చేయాలంటూ డెడ్ లైన్ విధించారు. రాష్ట్రం మొత్తం రహదారుల మరమ్మతులను ఒక స్పెషల్ డ్రైవ్ కింద చేపట్టాలని పేర్కొన్నారు. మొత్తం 46 వేల కిలోమీటర్ల మేర రోడ్ల పనులపై దృష్టి సారించాలని ఆదేశించారు.
తొలుత రోడ్లపై గుంతలు పూడ్చే ప్యాచ్ వర్క్ చేయాలని, తర్వాత కార్పెంటింగ్ పనులు పూర్తిచేయాలని నిర్దేశించారు. ఎలాంటి విమర్శలకు తావివ్వని రీతిలో వాహనదారులకు మెరుగైన రోడ్లు అందుబాటులోకి రావాలని అభిలషించారు. ఎన్డీబీ ప్రాజెక్టులో టెండర్లు చేజిక్కించుకుని, పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేర్చాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.