మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై వెబ్ సిరీస్
- ‘హాఫ్ లయన్’ పుస్తకం ఆధారంగా వెబ్ సిరీస్
- బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ ఝా దర్శకత్వం
- నిర్మించనున్న అల్లు అరవింద్
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై త్వరలోనే ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. భారతదేశ రూపురేఖలను పీవీ మార్చిన తీరుపై వినయ్ సీతాపతి ‘హాఫ్ లయన్’ పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. ఇప్పుడీ పుస్తకం ఆధారంగా అదే పేరుతో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారు.
హిందీ, తెలుగు, తమిళ భాషల్లో దీనిని తెరకెక్కించనున్నట్టు ప్రకాష్ ఝా ప్రకటించారు. 2023లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్‌ను ఆహా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మించనున్నాయి.
పీవీ నరసింహారావు 1991 నుంచి 1996 వరకు భారత ప్రధానిగా పనిచేశారు. పీవీ తన హాయంలో దేశంలో పలు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత సాధించారు. 1992లో హిందూ-ముస్లింల అల్లర్లకు దారితీసిన అయోధ్యలోని బాబ్రీ మసీదు విధ్వంసం కూడా ఆయన హయాంలోనే జరిగింది.