ముంబయిలో వాటర్ టాక్సీ సేవలు... వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి!

  • ముంబయిలో సరికొత్త రవాణా విధానం
  • పలుమార్గాల్లో వాటర్ టాక్సీలు
  • మూడు సంస్థలతో ఒప్పందం
  • త్వరలోనే మరో సంస్థతోనూ ఒప్పందం!
ముంబయిలో త్వరలోనే సరికొత్త రవాణా విధానం అందుబాటులోకి రానుంది. 2022 జనవరి నుంచి నగరంలో వాటర్ టాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ ముంబయి తీరం నుంచి నవీ ముంబయి మధ్య ఈ వాటర్ టాక్సీలు తిరగనున్నాయి. ఇప్పటికే మూడు సంస్థలు వాటర్ టాక్సీ సేవలు అందించేందుకు సన్నద్ధమవుతుండగా,  త్వరలోనే మరో సంస్థ కూడా రంగంలోకి దిగనుంది.

డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి నవీ ముంబయి వరకు ఒక ప్రయాణికుడి నుంచి రూ.1200 నుంచి రూ.1500 వరకు వసూలు చేయనున్నారు. జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ వరకు చార్జీ రూ.750 ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి ఎలిఫెంటా వరకు, డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి రేవాస్, ధరంతర్, కరంజాదే వరకు... డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి బేలాపూర్, నేరుల్, అయిరోలి, వాషి, ఖందేరీ ఐలాండ్స్, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ మార్గాల్లోనూ వాటర్ టాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో రూట్లో గరిష్ఠ ప్రయాణ నిడివి 30 నిమిషాలు ఉంటుందని అంచనా.


More Telugu News