తెలంగాణలో జనవరి 2 వరకు ఆంక్షలు: డీజీపీ మహేందర్ రెడ్డి
- ర్యాలీలు, సభలపై నిషేధం
- వేడుకల సందర్భంగా కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలి
- పబ్బులు, ఈవెంట్లలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలి
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణలో ఆంక్షలు విధించారు. జనవరి 2వ తేదీ వరకు ర్యాలీలు, సభలను నిషేధిస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త సంవత్సర వేడుకలను కూడా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని చెప్పారు. ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనలను అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని పోలీసులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేశామని... ఇంకా మిగిలిపోయినవారు ఉంటే వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. విధుల్లో ఉన్న పోలీసులు మాస్క్ లు ధరించాలని ఆదేశించారు. పబ్బులు, ఈవెంట్లలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు.