అందుకే 'రాధేశ్యామ్'కి డబ్బులు తీసుకోలేదు: తమన్

  • 'రాధే శ్యామ్'పై స్పందించిన తమన్
  • ఇది నా స్థాయిని మించిన సినిమా
  • యూవీ చేసిన సాయాన్ని మరిచిపోలేను
  • మార్చి 11న విడుదలవుతున్న సినిమా
ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' సినిమా రూపొందింది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమాను మార్చి 11వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ కి జస్టిన్ ప్రభాకరన్ బాణీలను సమకూర్చగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను తమన్ అందించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు.

"ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయమని యూవీ క్రియేషన్స్ వారు నన్ను అడిగారు. నిజానికి ఈ సినిమా స్థాయికి నేను సరిపోను. అయినా నా పట్ల గల నమ్మకంతో వారు ఈ ప్రాజెక్టును అప్పగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే నేను అనుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేస్తున్నప్పుడు నేను మరో ప్రపంచంలోకి వెళ్లిపోయాను.

ఇది పాన్ ఇండియా సినిమా అనే విషయం అందరికీ తెలిసిందే. అయినా నేను ఈ సినిమాకి పని చేసినందుకు పారితోషికం తీసుకోలేదు. ఎందుకంటే నా చేతిలో సినిమాలు లేనప్పుడు, యూవీ వారు 'మహానుభావుడు' .. 'భాగమతి' ప్రాజెక్టులను ఇచ్చి నాకు ఎంతో హెల్ప్ చేశారు. ఆ కృతజ్ఞత వల్లనే నేను డబ్బులు తీసుకోలేదు" అని చెప్పుకొచ్చారు.


More Telugu News