దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- నిన్న దేశంలో 44,877 కరోనా కేసులు
- యాక్టివ్ కేసులు 5,37,045
- రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతం
- నిన్న 14,15,279 కరోనా పరీక్షలు
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న దేశంలో 44,877 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 5,37,045 మంది కరోనాకు ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉంది.
గత 24 గంటల్లో కోలుకున్న వారి సంఖ్య 1,17,591 గా ఉంది. ఇప్పటి వరకు కరోనా వచ్చి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,15,85,711 గా ఉంది. దేశంలో మొత్తం 75.07 కోట్ల కరోనా టెస్టులు చేశారు. నిన్న 14,15,279 కరోనా పరీక్షలు చేశారు.