నిమ్మకూరులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు.. 28న సీఎం జగన్ శంకుస్థాపన!

  • జ‌గ‌న్‌ను క‌లిసిన ఎన్టీఆర్ బంధువులు  
  • ఈ నెల 28న శంకుస్థాప‌న‌ కార్య‌క్ర‌మమ‌న్న కొడాలి నాని
  • ఎన్టీఆర్ శ‌త జ‌యంతి నాడు విగ్ర‌హ ఆవిష్క‌రణ అని ప్ర‌క‌ట‌న‌
ఏపీ మంత్రి కొడాలి నానితో పాటు పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, నిమ్మకూరులో ఉంటున్న ఎన్టీఆర్‌ బంధువులు పెద వెంక‌టేశ్వ‌ర‌రావు, నంద‌మూరి జ‌య‌సూర్య‌, చిరుగుపాటి ముర‌ళి సీఎం వైఎస్‌ జగన్‌ని తాడేపల్లిలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో నిన్న కలిశారు. కొత్తగా ఏర్పాటు చేయ‌నున్న జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని నిర్ణయించినందుకు వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ కాంస్య విగ్రహం గురించి కొడాలి నాని మీడియాకు వివ‌రాలు తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆయన స్వస్థలం నిమ్మకూరులో ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారని కొడాలి నాని చెప్పారు. నిమ్మకూరులో 14 ఎకరాల చెరువు ప్రాంతంలో 25 అడుగుల ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని నెలకొల్పుతామని, ఈ నిర్మాణానికి ఈ నెల 28న శంకుస్థాప‌న చేస్తార‌ని, ఎన్టీఆర్ శ‌త జ‌యంతి నాడు ఆ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తార‌ని తెలిపారు. అనంత‌రం ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ బంధువులు నిమ్మకూరులో తాగునీటి సమస్యను కూడా తెలిపార‌ని అన్నారు. వెంటనే స్పందించిన జ‌గ‌న్ ఆ సమస్య పరిష్కారానికి రూ.కోటి మంజూరు చేశారని వివ‌రించారు.


More Telugu News