దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్
- దేశంలో నిన్న 30,757 కరోనా కేసులు
- కరోనాతో 541 మంది మృతి
- రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతం
- కోలుకున్న వారు మొత్తం 4,19,10,984 మంది
దేశంలో నిన్న 30,757 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. అలాగే, 541 మరణాలు సంభవించాయని పేర్కొంది. కరోనా నుంచి నిన్న 67,538 మంది కోలుకున్నారని వివరించింది. దేశంలో ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 3,32,918గా ఉందని చెప్పింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతంగా ఉందని పేర్కొంది ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 4,19,10,984 మంది కోలుకున్నారని తెలిపింది. దేశంలో మొత్తం 174,24,36,288 డోసుల కరోనా వ్యాక్సిన్లు వేశారని వివరించింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతంగా ఉందని పేర్కొంది ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 4,19,10,984 మంది కోలుకున్నారని తెలిపింది. దేశంలో మొత్తం 174,24,36,288 డోసుల కరోనా వ్యాక్సిన్లు వేశారని వివరించింది.