దేశంలో కొత్తగా 13,166 కరోనా కేసులు
- నిన్న 302 మంది మృతి
- రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతం
- మొత్తం 5,13,226 మంది మృతి
దేశంలో కొత్తగా 13,166 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కరోనా నుంచి 26,988 మంది కోలుకున్నారని వివరించింది. నిన్న కరోనా వల్ల 302 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 1,34,235 మంది కరోనాకు ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది. ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 4,22,46,884 మంది కోలుకున్నారు. 5,13,226 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 176,86,89,266 డోసుల వ్యాక్సిన్లు వాడారు.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది. ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 4,22,46,884 మంది కోలుకున్నారు. 5,13,226 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 176,86,89,266 డోసుల వ్యాక్సిన్లు వాడారు.