27న ఏపీ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక
- కరీమున్నీసా మృతితో ఉప ఎన్నిక
- 7న నోటిఫికేషన్, 14న నామినేషన్లు
- కరీమున్నీసా కుమారుడికే వైసీపీ టికెట్
- వైసీపీ విజయం లాంఛనమే
ఏపీలో మరో ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఏపీ శాసనమండలికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన కరీమున్నీసా పదవీ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే మరణించిన సంగతి తెలిసిందే. మార్చి 24న ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్న మార్చి 7న ఈ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 14 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 15న నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఆ తర్వాత 24న పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలో ఆయా పార్టీల బలాబలాలను చూస్తే.. ఈ స్థానానికి టీడీపీ పోటీ చేసినా వైసీపీనే విజయం వరిస్తుంది.
అంతేకాకుండా కరీమున్నీసా స్థానంలో ఆమె కుమారుడినే బరిలోకి దింపనున్నట్లుగా ఇప్పటికే జగన్ ప్రకటించారు. దీంతో ఎమ్మెల్సీగా కరీమున్నీసా కుమారుడి గెలుపు లాంఛనప్రాయమేనన్న అబిప్రాయం వ్యక్తమవుతోంది.