కోహ్లీ వందో టెస్ట్.. ఫ్యాన్స్ కు రవిశాస్త్రి ‘ట్రేసర్ బుల్లెట్’ చాలెంజ్.. చేసి చూపించిన కోహ్లీ.. వీడియో ఇదిగో
- వందో టెస్టు సెలబ్రేషన్స్ కు వంద కారణాలన్న మాజీ కోచ్
- ‘కవర్స్’వైపు ఎంజాయ్ చెయ్యాలంటూ కోహ్లీకి విషెస్
- తనలా ‘ట్రేసర్ బుల్లెట్’ కామెంటరీ చెయ్యాలంటూ ఫ్యాన్స్ కు చాలెంజ్
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇవాళ వందో టెస్టు బరిలోకి దిగేశాడు. ప్రస్తుతం నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్ అతడికి ఎమోషనల్ గా ఎంతో కీలకంగా మారింది. అయితే, కోహ్లీ వందో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా మాజీ కోచ్ రవిశాస్త్రి అందరికీ ఓ చాలెంజ్ విసిరాడు. కోహ్లీకి ‘ఆల్ ద బెస్ట్’ చెబుతూనే.. కామెంటరీలో ‘ట్రేసర్ బుల్లెట్’ గురించి తాను చెప్పినట్టు చేసి చూపించాలని చాలెంజ్ విసిరాడు. అభిమానులకు ట్రేసర్ బుల్లెట్ చాలెంజ్ విసురుతూ ఓ వీడియోను ఆయన ట్వీట్ చేశారు.
‘‘కోహ్లీ వందో టెస్టును వేడుకగా చేసుకోవడానికి వంద కారణాలు. ఇదో అద్భుతమైన శతకం. మ్యాచ్ చూసేందుకు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా. ఈ మ్యాచ్ ను ‘కవర్స్’ దిశగా ఎంజాయ్ చెయ్ చాంప్’’ అంటూ ట్వీట్ చేశారు. అందరికీ ట్రేసర్ బుల్లెట్ చాలెంజ్ విసిరారు. తాను చెప్పినట్టు చెప్పి చూపించాలన్నారు. దీంతో కోహ్లీ కామెంటరీ చేసి చూపించాడు. ‘‘మీలాగా నేను చెప్పలేను కానీ.. బాగానే చేశాననుకుంటా’’ అని వీడియో తర్వాత కోహ్లీ పేర్కొన్నాడు. మరి, కోహ్లీ ఎలా చెప్పాడో ఈ వీడియో చూసి మీరు చెప్పండి!!