రష్యా యుద్ధోన్మాదం.. 'మెటా'పై క్రిమినల్ కేసు నమోదు
- ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం
- రష్యా సైనికులను హంతకులు అన్న మెటా
- ప్రతిగా మెటాపై క్రిమినల్ కేసు నమోదు చేసిన రష్యా
- మెటా సేవలను అమెరికా నిలిపేయాలంటూ డిమాండ్
రష్యా ఎంతటి యుద్ధోన్మాదంతో రగిలిపోతోందో..ఉక్రెయిన్‌పై ఆ దేశం సాగిస్తున్న బాంబుల వర్షాన్ని చూస్తే తెలిసిపోతోంది. ఉక్రెయిన్‌పై తాను సాగిస్తున్న యుద్దాన్ని ఏ ఒక్కరు కూడా ప్రశ్నించజాలరన్న రీతిలోనూ రష్యా తనదైన శైలి కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. ఉక్రెయిన్‌పై అకారణంగా యుద్ధానికి దిగారన్న కారణం చూపిన అమెరికా, నాటో, ఈయూ దేశాలు రష్యాపై ఎన్నెన్ని ఆంక్షలు విధిస్తున్నా కూడా రష్యా వెనక్కు తగ్గకపోగా.. తనపై ఆంక్షలు విధిస్తే.. తనపై యుద్ఠం చేస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుందని కూడా రష్యా బెదిరిస్తోంది.
తాజాగా రష్యా ఏ పాటి యుద్ధోన్మాదంతో రగిలిపోతోందో చెప్పేందుకు మరో సాక్ష్యం లభించింది. ఉక్రెయిన్‌పై దండెత్తి వచ్చిన రష్యా సైనికులు..ఉక్రెయిన్‌లోని మిలిటరీ బేస్‌లను కాకుండా జనావాసాలను కూడా టార్గెట్ చేస్తున్న వైనాన్ని ప్రశ్నించిన ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా రష్యా సైనికులను హంతకులుగా అభివర్ణించిందట.
ఇక ఈ మాట చెవినపడినంతనే రష్యా రగిలిపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెటాపై ఏకంగా క్రిమినల్ కేసు బుక్ చేసి పారేసింది. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడిస్తూ రష్యా కీలక ప్రకటన చేసింది. రష్యా సైనికులను హంతకులు అని సంబోధించినందుకే మెటాపై క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో రష్యా పేర్కొంది. ఇదిలా ఉంటే..తమ సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మెటా సేవలను నిలిపివేయాలంటూ అమెరికాను రష్యా డిమాండ్ చేసింది.