కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ఎమ్మెల్సీ రాజీనామా

  • పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి ఇబ్ర‌హీం రాజీనామా  
  •  మండలిలో ప్రతిపక్ష నాయకుడి పదవి ఆశించిన వైనం
  • మరొకరిని నియమించడంతో అలకతో రాజీనామా  
క‌ర్ణాట‌కకు చెందిన సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ సీఎం ఇబ్ర‌హీం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయ‌న శ‌నివారం త‌న రాజీనామా లేఖ‌ను పంపారు. కర్ణాటక శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడి పదవి ఆశించిన ఇబ్రహీం.. తనకంటే జూనియర్‌ అయిన బీకే హరిప్రసాద్‌ను విపక్ష నేతగా నియమించడంపై అసంతృప్తితో ఉన్నారు. 

ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి, పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన‌ట్టుగా విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.  పార్టీ ప‌రిస్థితిపై 12 ఏళ్లుగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తాను పలు లేఖలు రాశానని పేర్కొన్న ఆయన.. తాను ప్ర‌స్తావించిన అంశాల‌పై అధిష్ఠానం అస‌లు దృష్టే సారించ‌లేద‌ని కూడా తీవ్ర ఆరోప‌ణ చేశారు.


More Telugu News