ఆర్టీసీ బస్సులో థియేటర్ కు వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ టీం
- రాజమౌళి, రామ్ చరణ్ ప్రయాణం
- జెండాలు పట్టుకుని ఘన స్వాగతం పలికిన అభిమానులు
- ఆర్టీసీకి ‘ఆర్ఆర్ఆర్’ టీం కృతజ్ఞతలు
ఎన్నో వాయిదాల తర్వాత థియేటర్లలోకి వచ్చేసింది ‘ఆర్ఆర్ఆర్’. సిల్వర్ స్క్రీన్ పై ప్రభంజనమే సృష్టిస్తోంది. ఫ్యాన్స్ తో కలిసి ఆర్ఆర్ఆర్ టీం నిన్న రాత్రి హైదరాబాద్ లో సినిమా చూసింది. అందుకోసం ‘ఆర్ఆర్ఆర్’ టీంకు టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సును ఏర్పాటు చేసింది. ప్రీమియర్ షో మొదలైనప్పట్నుంచి ‘ఆర్ఆర్ఆర్’టీం మొత్తం బస్సుల్లోనే థియేటర్లకు వెళ్లింది.
డైరెక్టర్ రాజమౌళి, హీరో రామ్ చరణ్, ఆర్ఆర్ఆర్ యూనిట్ లోని పలువురు ప్రముఖులు బస్సులో థియేటర్ కు చేరుకున్నారు. కాగా, స్పెషల్ బస్సు వేయడంపై ఆర్టీసీకి ‘ఆర్ఆర్ఆర్’ టీం కృతజ్ఞతలు తెలిపింది. అంతేగాకుండా సినిమా చూసేందుకు ప్రత్యేక బస్సులు వేస్తున్నందుకు ధన్యవాదాలు అని పేర్కొంది. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అయిపోయింది.
బస్సులో వచ్చిన చిత్ర బృందానికి అభిమానులు జెండాలు పట్టుకుని ఘన స్వాగతం పలికారు. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమా కోసం టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.