సరికొత్త నెలవారీ ప్లాన్ ను తీసుకువచ్చిన జియో... వివరాలు ఇవిగో!

  • నెలరోజుల పాటు వర్తించే జియో 259
  • ఇటీవలే ట్రాయ్ ఆదేశాలు
  • నెల రోజుల కాలావధి ప్లాన్లు తీసుకురావాలని స్పష్టీకరణ
భారత టెలికాం దిగ్గజం జియో మరో కొత్త ప్లాన్ తీసుకువచ్చింది. ఇది నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్. దీని ధర రూ.259. ఇప్పుడున్న ప్లాన్ లలో చాలావరకు 24 రోజులు,  28 రోజులు, 56 రోజులు, 84 రోజులు వరకు వర్తించేలా ఉంటాయి. అయితే, జియో 259 ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే... దీనికి రోజులతో సంబంధం లేదు. ఓ నెలలో 2వ తేదీన ఈ ప్లాన్ తీసుకుంటే, మళ్లీ వచ్చే నెలలో సరిగ్గా 2వ తేదీనే రీచార్జి చేయించాల్సి ఉంటుంది. ప్లాన్ వివరాలు చూస్తే... రోజుకు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తారు. ఇతర ప్రయోజనాలు అదనం. 

ఇలా కచ్చితంగా నెలరోజులకు వర్తించేలా తీసుకువచ్చిన ప్లాన్ దేశంలో ఇప్పటివరకు ఇదొక్కటే. ఇటీవల ట్రాయ్ టెలికాం సంస్థలకు పలు ఆదేశాలు ఇచ్చింది. నెల రోజుల కాలపరిమితితో రెగ్యులర్ ప్లాన్, స్పెషల్ టారిఫ్, కాంబో పథకాలను తప్పనిసరిగా వినియోగదారులకు అందించాలని ట్రాయ్ స్పష్టం చేసింది.


More Telugu News