వారిపై పరువు నష్టం దావాకు అనుమతివ్వండి.. ఏపీ ప్రభుత్వానికి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ
- చెవిరెడ్డి, సాక్షి మీడియా, సీఎం సీపీఆర్వోలపై పరువు నష్టం దావా ప్రస్తావన
- తప్పుడు ప్రచారంతో తన కుటుంబీకులు చాలా ఇబ్బంది పడ్డారని వ్యాఖ్య
- సాధారణ పరిపాలన శాఖకు లేఖ
- అదే లేఖను సీఎస్‌కు కూడా పంపిన ఏబీవీ
ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సోమవారం నాడు ఏపీ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. తన పరువుకు భంగం కలిగించిన ఐదుగురు వ్యక్తులు, సంస్థలపై పరువు నష్టం దావా వేయాలనుకుంటున్నానని, అందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన ఆ లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. సాధారణ పరిపాలన శాఖకు రాసిన సదరు లేఖ ప్రతిని ఆయన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కూడా పంపారు.
తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా దాఖలు చేయాలనుకుంటున్నానని ఈ లేఖలో ఏబీ పేర్కొన్నారు. తాను పరువు నష్టం దావా దాఖలు చేయాలనుకుంటున్న వారిలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఛానెల్‌లతో పాటు సీఎం సీపీఆర్వో శ్రీహరి ఉన్నారని ఆయన తెలిపారు. సీఎం సీపీఆర్వో తన సస్పెన్షన్‌పై తప్పుడు సమాచారాన్ని మీడియాకు విడుదల చేశారని ఆరోపించారు. ఈ విషయాలను మీడియా ప్రసారం చేయడంతో తన కుటుంబీకులు చాలా ఇబ్బంది పడ్డారని ఏబీవీ ఆరోపించారు.