కొత్త జిల్లాల నోటిఫికేషన్ జారీకి సిద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం

  • చివరి అంకానికి చేరుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ
  • తిరుపతి పేరుతోనే కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశం
  • కొత్తగా మరో 4 డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమయింది. కొత్త జిల్లాల విషయంలో ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 11 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. ఈ అభ్యంతరాలపై రాష్ట్ర కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇచ్చింది. ఈ క్రమంలో క్షేత్ర స్థాయి పరిస్థితులపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మరోవైపు శ్రీబాలాజీ జిల్లాకు బదులు తిరుపతి పేరుతోనే జిల్లాను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రకటించిన 11 డివిజన్లు కాకుండా కొత్తగా మరో 4 డివిజన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.


More Telugu News