'ఆర్ ఆర్ ఆర్'లో ఆ పాట పాడింది ఈ అమ్మాయే!

  • 'కొమ్మా ఊయాలో .. కోనా ఊయాలో' పాటతో సినిమా మొదలు 
  •  'ప్రకృతి' అనే అమ్మాయి ఈ పాట పాడిందన్న కీరవాణి 
  • త్వరలోనే ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్  
'ఆర్ ఆర్ ఆర్' సినిమా 'కొమ్మా ఊయాలో .. కోనా ఊయాలో' అనే పాటతో మొదలవుతుంది. గోండు జాతికి చెందిన మల్లి అనే అమ్మాయి ఈ పాట పాడుతూ, తెల్ల దొరసాని చేతిపై అందమైన డిజైన్ పెడుతుంది. దాంతో ఆ దొరసాని ఆ అమ్మాయిని బలవంతంగా తనతో పాటు ఢిల్లీకి తీసుకుపోతుంది. ఈ అమ్మాయి కోసమే కొమరం భీమ్ రంగంలోకి దిగుతాడు.

ఈ పాటను విన్నప్పుడు .. ఎవరబ్బా పాడింది అని తప్పకుండా అనుకుంటారు. మనసుకు హాయిగా అనిపించే ఆ పాటను పాడింది 'ప్రకృతి' అనే అమ్మాయి అని కీరవాణి చెప్పారు. తను చాలా టాలెంటెడ్ అనీ .. మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. త్వరలోనే ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను రిలీజ్ చేస్తామనీ, అప్పుడు ప్రకృతి పాడిన పూర్తి పాటను వినొచ్చునని చెప్పారు. 

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా, 1000 కోట్ల మార్క్ దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పడం ఇప్పుడు అందరిలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీక్వెల్ ఎప్పుడు కార్యరూపాన్ని దాల్చనుంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.


More Telugu News