అమిత్ షాతో జ‌గ‌న్ భేటీ.. రాజ‌కీయాంశాల‌పై కీల‌క చ‌ర్చ‌!

  • స‌రిగ్గా 9.30 గంట‌ల‌కు భేటీ ప్రారంభం
  • రాష్ట్ర అభివృద్ధి, రాజ‌కీయాంశాల‌పై చ‌ర్చ‌
  • అమిత్ షాతో జ‌గ‌న్ భేటీపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీబిజీగా సాగుతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స‌హా కేంద్ర మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్‌, గ‌జేంద్ర సింగ్ షెకావత్‌ల‌తో భేటీ అయిన జ‌గ‌న్‌.. కాసేప‌టి క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. 

అమిత్ షాతో భేటీలో రాష్ట్ర అభివృద్ధితో పాటు రాజ‌కీయ అంశాల‌పై జ‌గ‌న్ కీల‌క చ‌ర్చ‌లు సాగిస్తున్నారు. జ‌గ‌న్‌తో భేటీకి సంబంధించి అమిత్ షా చివ‌రి నిమిషంలో అపాయింట్ మెంట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ అపాయింట్ మెంట్ ప్ర‌కారం రాత్రి 9.30 గంట‌ల‌కు త‌న‌తో భేటీకి రావాల‌ని జ‌గ‌న్‌కు అమిత్ షా సమాచారం పంపించారు. ఆ మేర‌కు స‌రిగ్గా 9.30 గంట‌ల‌కు అమిత్ షా ఇంటికి జ‌గ‌న్ చేరుకున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య భేటీ సుదీర్ఘంగా సాగే అవ‌కాశాలున్నాయి. ఈ భేటీపై ఏపీలో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.


More Telugu News