హీరోయిన్ కాకముందు రవీనా టాండన్ ఏం చేసేవారో తెలుసా?
- తొలి రోజుల్లో ఒక స్టూడియోలో ఫ్లోర్ తుడిచే పని చేసిన రవీనా
- ఎవరైనా వాంతి చేసుకుంటే అక్కడ శుభ్రం చేయాల్సి వచ్చేది
- ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టిన వైనం
తొలి రోజుల్లో ఆమె ఒక స్టూడియోలో ఫ్లోర్ తుడిచేవారు. ఎవరైనా అక్కడ వాంతి చేసుకుంటే వెంటనే శుభ్రం చేసే పని చేసేవారు. ఇలాంటి పనులు ఆమె చాలా చేశారు. ఆ తర్వాత ఆమె ప్రహ్లాద్ కక్కర్ వద్ద అసిస్టెంట్ గా చేశారు. ఆ సమయంలో ఎవరైనా మోడల్ టైమ్ కి రాకపోతే రవీనాకు మేకప్ వేసి, పోజులు ఇవ్వమనేవారు. ఆ విధంగా ఆమె మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సినీ అవకాశాలు కూడా రావడంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సినిమాల్లోకి రాకముందు ఆమెకు యాక్టింగ్, డ్యాన్స్ ఏమీ తెలియవు. హీరోయిన్ అయిన తర్వాతే ఆమె ఇవన్నీ నేర్చుకున్నారు.