కేరళలో బెంబేలెత్తిస్తున్న టమాటా ఫ్లూ.. లక్షణాలు ఇవే!
- కేరళలోని కొల్లాంలో వెలుగుచూసిన వైరస్
- ఆసుపత్రి పాలైన 80 మంది చిన్నారులు
- జ్వరం, నీరసం, జలుబు, దగ్గు, కడుపునొప్పి వంటి లక్షణాలు
- బాధిత చిన్నారులందరూ ఐదేళ్లలోపు వారే
- అప్రమత్తమైన పొరుగు రాష్ట్రం తమిళనాడు
కరోనా వైరస్ నుంచి పూర్తిగా బయటపడకముందే ఇప్పుడు టమాటా వైరస్ రూపంలో మరోటి దాడిచేస్తోంది. కేరళలో వెలుగు చూసిన ఈ ఫ్లూ కారణంగా పలువురు చిన్నారులు తీవ్ర జ్వరం, వాంతులు, విరేచనాలు, ఇతర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రమాదకర ఈ వైరస్ కారణంగా కొల్లాంలో 80 మంది చిన్నారులు ఆసుపత్రుల పాలయ్యారు. ఈ వైరస్ బారినపడిన చిన్నారుల వయసు ఐదేళ్లలోపు కావడం గమనార్హం.
అత్యంత అరుదైన ఈ వ్యాధి కారణంగా చర్మంపై ఎర్రటి బొబ్బలు వస్తాయి. అవి టమాటా ఆకారంలో ఉండడంతోనే దానికా పేరు పెట్టినట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ ఫ్లూ బారినపడిన వారిలో తీవ్రమైన జ్వరం, నీరసంగా అనిపించడం, ఒళ్లు నొప్పులు, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే, కొందరు చిన్నారుల్లో జలుబు, దగ్గు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, చేతులు, మోకాళ్లు, పిరుదులు రంగు మారుతాయని చెబుతున్నారు.
ప్రస్తుతం కొల్లాంకే పరిమితమైన ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని కేరళ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కేరళలో ఈ ఫ్లూ వెలుగు చూడడంతో తమిళనాడు అప్రమత్తమైంది. కేరళ నుంచి వచ్చే వారికి సరిహద్దుల్లోనే పరీక్షలు చేస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతోపాటు శరీరంలో నీటి స్థాయులు తగ్గకుండా చూసుకోవడం ద్వారా టమాటా వైరస్‌కు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.