'అంటే .. సుందరానికీ' నుంచి ట్రైలర్ గ్లింప్స్!

  • వినోదమే ప్రధానంగా రూపొందిన 'అంటే .. సుందరానికీ'
  • నాని సరసన కనిపించనున్న నజ్రియా
  • జూన్ 2వ తేదీన ట్రైలర్ రిలీజ్
  • అదే నెల 10వ తేదీన సినిమా విడుదల
నాని హీరోగా చేసిన 'అంటే .. సుందరానికీ' సినిమాను వచ్చేనెల 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా ప్రమోషన్స్ జోరును పెంచారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి నజ్రియా పాత్ర లీలా థామస్ కి సంబంధించిన బ్లూపర్స్ ను వదిలిన టీమ్, తాజాగా ట్రైలర్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. 

ముఖ్యమైన పాత్రలను పరిచయం చేస్తూ, కామెడీ టచ్ తో కూడిన సీన్ పై ఈ గ్లింప్స్ ను కట్ చేశారు. ట్రైలర్ ను వచ్చేనెల 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు.

వినోద ప్రధానంగానే ఈ కథ నడవనుంది. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న నజ్రియా ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది. ముఖ్యమైన పాత్రలలో నరేశ్ .. నదియా .. రోహిణి కనిపించనున్నారు. డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న నాని, ఈ సినిమా తనకి తప్పకుండా పెద్ద హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.


More Telugu News